
- గద్వాల జిల్లా షీ టీంకు ఫస్ట్ ప్లేస్
గద్వాల, వెలుగు : మహిళలపై జరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడంలో మల్టీ జోన్ –-2 లో జోగులాంబ గద్వాల జిల్లా షీటీంకు ఫస్ట్ ప్లేస్ వచ్చిందని ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్టీ జోన్ –2 లో మొత్తం 13 జిల్లాల్లో గద్వాలకు ఫస్ట్ ప్లేస్ రావడం అభినందనీయమన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో గతేడాది జనవరిలో షీ టీంకు మొత్తం 14 ఫిర్యాదులు రాగా, అందులో 13 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెపారు. జిల్లాలో గుర్తించిన హాట్ స్పాట్ లను తరచూ సందర్శించి షీ టీం ఉత్తమ ప్రతిభ కనబర్చిందని వివరించారు. వేధింపులకు గురైనవారు ఎవరైనా 8712670312 లేదా 100 డయల్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.