![గద్వాల పట్టణంలో పోలీసుల తనిఖీలు](https://static.v6velugu.com/uploads/2025/02/15-arrested-12-vehicles-seized-in-surprise-checks_eAG5s8YN7C.jpg)
గద్వాల టౌన్, వెలుగు: గద్వాల పట్టణంలో శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లాడ్జీలు, వైన్ షాప్స్ తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించగా 15 మంది పట్టుబడ్డారు. 12 వెహికల్స్ ను సీజ్ చేశారు. 50 మంది పోలీసులతో విస్తృతంగా తనిఖీలు చేశామని టౌన్ ఎస్సై కల్యాణ్ కుమార్ తెలిపారు.