మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక పూర్తయింది. జీహెచ్ఎంసీ మేయర్‌గా కే కేశవరావు కూతురు, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. చేతులెత్తే విధానం ద్వారా వీరి ఎన్నిక జరిగింది.
బీజేపీ నుంచి కూడా అభ్యర్థులను నామినేట్ చేశారు. కానీ, సరిపోయేంత బలం లేకపోవడంతో.. టీఆర్ఎస్ అభ్యర్థులు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు.
For More News..