ప్రజలకు శుద్ధమైన నీళ్లు ఇవ్వాలి : కలెక్టర్  సంతోష్

ప్రజలకు శుద్ధమైన నీళ్లు ఇవ్వాలి : కలెక్టర్  సంతోష్

గద్వాల, వెలుగు: జిల్లాలో నీటి క్వాలిటీని నిరంతరం పరీక్షించి, శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  సంతోష్  ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్-27లో జిల్లా గ్రామీణ నీటి విశ్లేషణ ప్రయోగశాలను కలెక్టర్  ప్రారంభించారు. ప్రయోగశాలలోని వివిధ విభాగాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు జేజేఎం రూల్స్ కు అనుగుణంగా ఎన్ఏబీఎల్  అక్రిడిటేషన్‌‌‌‌‌‌‌‌కు అనుగుణమైన ప్రమాణాలతో జిల్లా స్థాయి నీటి నాణ్యత ప్రయోగశాలను ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ ల్యాబ్  ద్వారా తాగునీటి నమూనాలను శాస్త్రీయంగా విశ్లేషించి, అందులోని రసాయనాలు, సూక్ష్మజీవుల కాలుష్య స్థాయిని గుర్తించవచ్చని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్​ కాంప్లెక్స్​లో ప్రజలు, కార్యాలయ సిబ్బంది కోసం వాటర్​ ప్లాంట్​ను ప్రారంభించారు. అడిషనల్  కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ రావు, ఆర్డీవో శ్రీనివాస రావు, డీపీవో నాగేంద్రం, మిషన్  భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన వాల్ పోస్టర్ ను రిలీజ్  చేశారు.