గద్వాల, వెలుగు: హాస్టళ్లలో స్టూడెంట్స్ ఈ నెల 16 నుంచి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గద్వాల, గంజిపేటలో ఎస్సీ, బీసీ హాస్టళ్లను మంగళవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్ లకు క్వాలిటీ విద్య అందించేందుకు స్పెషల్ క్లాస్ లను నిర్వహించాలని సూచించారు. మెనూ ప్రకారం ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు.
అంతకు ముందు స్థానిక ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల అవసరాలకు తొలగించిన కాలేజీ గోడలను వెంటనే పున: నిర్మించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులను వచ్చే 15 రోజులలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్ బీ ఈఈ ప్రగతి, జిల్లా ఆఫీసర్లు రమేశ్ బాబు, సరోజ, పంచాయతీరాజ్ ఈఈ దామోదర్ రావు, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.