గద్వాల, వెలుగు: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. రాష్ట్ర అవతరణ వేడుకలపై కలెక్టరేట్లో గురువారం ఆయన మీటింగ్ నిర్వహించారు. అన్ని ఆఫీసుల్లో ఉదయం 8.30 గంటలకు పతాకావిష్కరణ చేసి, 9 గంటలకు కలెక్టరేట్ లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రామ్ చందర్ తదితరులు ఉన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ సీతారామారావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ పోలీస్ గ్రౌండ్లో జూన్ 2న జరిగే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.