
- రాష్ట్రస్థాయిలో మూడో ప్లేస్ కైవసం
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఫుట్బాల్ టీమ్ సీఎం కప్పు పోటీల్లో రాష్ట్రస్థాయిలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు తెలిపారు. సీఎం కప్ గత మూడురోజుల నుంచి హకీం పేట్ స్పోర్ట్ స్కూల్ గ్రౌండ్ లో జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా జట్లు పాల్గొనగా.. గద్వాల జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు. ప్రతిభ చూపిన ఆటగాళ్లను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండల వెంకట రాములు, సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెజరర్ త్యాగరాజు , ప్యాట్రన్ నరసింహ రాజు అభినందించారు.