- వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల రిక్వెస్ట్
గద్వాల, వెలుగు: అంగన్ వాడీ టీచర్లు, ఆయాలతో ఆదివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆశీర్వాద సభ పేరుతో పొలిటికల్ మీటింగ్ నిర్వహించడం దుమారం రేపుతోంది.
అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలను అన్నివిధాలుగా ఆదుకున్నామని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరడం, కొందరు యూనియన్ లీడర్లు పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలకతీతంగా ఉండాల్సిన అంగన్ వాడీ టీచర్లు, ఆయాలతో మీటింగ్ పెట్టడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.