హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం ఇంటికి వెళ్లిన బండ్ల.. రేవంత్‌తో భేటీ అయ్యారు. ఇటీ వలే బీఆర్ఎస్ కు గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి.. మళ్లీ సొంత గూటికి పోతున్నట్లు ప్రకటించడంతో కాం గ్రెస్ లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో ఆయన సీఎం రేవంత్ ను కలవడంతో ఇక బండ్ల కాంగ్రెస్ లోనే కొనసాగను న్నారనే సంకేతాలను ఇచ్చినట్ల యిందని ఆ పార్టీ నేతలు అంటు న్నారు. వారం రోజులుగా బండ్ల విషయంలో కొనసాగుతున్న సస్పెన్షన్ కు తెరపడినట్లయింది.