టీఆర్ఎస్ పార్టీ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిగా కే కేశవరావు కూతురు, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, డిప్యూటీ మేయర్‌గా రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పేర్లను ప్రకటించింది.
తెలంగాణభవన్‌లో కేటీఆర్‌తో సమావేశం ముగిసిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు మూడు బస్సులలో జీహెచ్ఎంసీ ఆఫీసుకు బయలుదేరారు. అటు బీజేపీ కార్పొరేటర్లు కూడా బషీర్ బాగ్‌లోని ముత్యాలమ్మ టెంపుల్‌లో పూజలు నిర్వహించి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 కార్పొరేటర్ స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరిగింది. అయితే గత పాలకవర్గానికి గడువు ఫిబ్రవరి వరకు ఉండటంతో నూతన పాలకవర్గాన్ని ఇప్పటివరకు ఎన్నుకోలేదు.
For More News..