గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. గద్వాల జడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి తన రాజీనామా లేఖను పంపారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏక పక్ష వైఖరి, అనాలోచిత విధానాలు నచ్చకే..బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య తెలిపారు.
ALSO READ :కేసీఆర్కు దమ్ముంటే బీసీని సీఎం చేయాలి
గద్వాలలో తనతో పాటు అనేక మంది బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే వైఖరి వల్ల ఇబ్బంది పడుతున్నారని సరిత తిరుపతయ్య తెలిపారు. చాలా సార్లు జెడ్పీ సమావేశం జరగకుండా చూశారని చెప్పారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా బీఆర్ఎస్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నామన్నారు. దీనిపై పలు మార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అందుకే విసిగిపోయి బీఆర్ఎస్ను వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామని వెల్లడించారు. గద్వాల జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య బాటలో మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.