రైతులు ఖాతాలను ఆధార్​తో లింక్​ చేయాలి : గజానంద్

నస్పూర్, వెలుగు: జిల్లాలోని సీసీఐకు పత్తి విక్రయించిన రైతులు తమ బ్యాంక్, ఇండియా పోస్ట్ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ బ్యాంక్ ఖాతా ఆధార్​తో అనుసంధానం చేసుకోకపోతే పత్తి అమ్మిన డబ్బులు అకౌంట్​లో జమ కావన్నారు.

పత్తి అమ్మిన డబ్బులు అకౌంట్​లో పడని రైతులు తక్షణమే సమీపంలోని పోస్టాఫీస్ లో సంప్రదించి తమ ఖాతాను సేవింగ్ ఖాతాగా మార్చుకొని, వ్యవసాయ మార్కెట్ కమిటీలో సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు ఆఫీస్​ పని వేళల్లో చెన్నూర్ మార్కెట్ కమిటీ 7330733454, బెల్లం పల్లి మార్కెట్ కమిటీ 7330733462, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ 7330700446 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.