గజ్వేల్ కాంగ్రెస్​లో గ్రూపుల లొల్లి

గజ్వేల్ కాంగ్రెస్​లో గ్రూపుల లొల్లి

గజ్వేల్, వెలుగు: గజ్వేల్​కాంగ్రెస్​లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో సంస్థాగత మార్పులు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాల గురించి చర్చించేందుకు గురువారం ఏఐసీసీ మెదక్ ​పార్లమెంటరీ ఇన్​చార్జి పీసీ విష్ణునాథ్​గజ్వేల్​వచ్చారు. అంతకముందే సమాచారమందుకున్న పార్టీ ప్రచార కార్యదర్శి బండారు  శ్రీకాంత్ రావు, పీసీసీ డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి తమ అనుచరులతో ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజ్ఞాపూర్ హరిత హోటల్లో వెయిట్ చేస్తున్నారు. 

ఇదే సమయంలో డీసీసీ ప్రెసిడెంట్​నర్సారెడ్డి వర్గీయులు కూడా అక్కడికి వచ్చారు. ఈ సమయంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బండారు శ్రీకాంత్ రావు కు గాయాలయ్యాయి.