
- కేసీఆర్ గెలిచినా అధికారానికి దూరం
సిద్దిపేట, వెలుగు: గజ్వేల్ నియోజకవర్గ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. గతంలో గజ్వేల్‌లో గెలిచిన పార్టీ రాష్ర్టంలో అధికార పగ్గాలు చేపట్టేది. కానీ మొదటిసారి ఈ ఆనవాయితీ తారుమారైంది. గజ్వేల్నియోజకవర్గం ఏర్పడిన తరువాత కొన్ని దశాబ్దాలుగా ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. కానీ ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేయలేదు.
గజ్వేల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ విజయం సాధించినా రాష్ట్రంలో అధికారానికి దూరమయ్యారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా వస్తున్న గజ్వేల్ సెంటిమెంట్ కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది.