బీఆర్ ఎస్ కు ఓటెయ్యదు.. కేసీఆర్ కు రైతుల బాధలు తెలియాల..

బీఆర్ ఎస్ కు ఓటెయ్యదు.. కేసీఆర్ కు రైతుల బాధలు తెలియాల..

 గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా చెరుకు రైతులు  బద్దం శ్రీనివాస్ రెడ్డి, మామిడి నారాయణ రెడ్డి, నవ నంది లింబద్రి నామినేషన్లు దాఖలు చేశారు. రైతులకు మేలు చేసేవారికి ఓటు వేయాలని, సీఎం కేసీఆర్ కు వేయవద్దని రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తామన్నారు. ...  అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నామినేషన్ వేశామన్నారు.  తాము గెలవాలని కాదంటూ.. కేసీఆర్ కు రైతుల బాధలు తెలియాలనే ఉద్దేశంతోనే నామినేషన్లు వేశామని ఇండిపెండెంట్లు అన్నారు. 

also read :- సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. కేసీఆర్ ఫ్యామిలీ అడుక్కునేది : రేవంత్ రెడ్డి
 

చక్కెర ఫ్యాక్టరీ లను తెరిపిస్తా అని హామీ ఇచ్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చినా ఇంతవరకు షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ కాలేదనన్నారు. చెరుకు రైతులు నష్టపోతుండగా..  వరి వేస్తే ఉరి అన్న సీఎం కేసీఆర్ చెక్కర ఫ్యాక్టరీలు ఎందుకు తెరిపిస్తలేడని ఇండిపెండెంట్ అభ్యర్థులు  ప్రశ్నించారు.