
Galaxy Surfactants Stock: నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చూసిన సంగతి తెలిసిందే. ట్రంప్ వాణిజ్య పన్నుల యుద్ధానికి కాలు దువ్వటంతో సెంటిమెంట్లు దెబ్బతినటమే దీనికి కారణంగా నిలిచిందే. అయితే నిన్నటి నష్టాల నుంచి నేడు మార్కెట్లు తిరిగి తేరుకున్నాయి. అయితే ట్రంప్ భారత్ విషయంలో ప్రకటించే టారిఫ్స్ ఏ రంగాలను ప్రభావితం చేస్తాయనేదాని ప్రకారం మార్కెట్లు ముందుకు సాగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మార్కెట్లు తిరిగి గాడిన పడినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో నేడు మార్కెట్లో చాలా మంది దృష్టిని గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్ కంపెనీ షేర్లు ఆకర్షిస్తున్నాయి. ఇంట్రాడేలో అత్యధికంగా స్టాక్ 9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే మధ్యాహ్నం 1.32 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.2వేల 246 వద్ద కొనసాగుతోంది. అయితే దీనివెనుక ఒక పెద్ద కారణం కూడా ఉంది. అదే ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లాక్ డీల్ ద్వారా కంపెనీలో వాటాలను కొనుగోలు చేయటమే.
ఎన్ఎస్ఈ బల్క్ డీల్స్ డేటా ప్రకారం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏప్రిల్ 1న గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్ కంపెనీకి చెందిన 2లక్షల 97వేల 500 షేర్లను కొనుగో లు చేసిందని వెల్లడైంది. వీటిని సగటున రూ.2వేల 92 రేటు చొప్పున మ్యూచువల్ ఫండ్ దక్కించుకోవటం గమనార్హం. దీంతో కంపెనీలో మ్యూచువల్ ఫండ్ సంస్థ దాదాపు 1 శాతం వాటాను కైవసం చేసుకుంది. పెద్ద మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కంపెనీ షేర్లను భారీ సంఖ్యలో కొనుగోలు చేసినట్లు వార్త బయటకు రావటంతో ఇన్వెస్టర్లు షేర్లను దక్కించుకునేందుకు ఎగబడటంతో స్టాక్ ధర అమాంతం పెరిగింది. కంపెనీలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కూడా 4.38 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నట్లు వెల్లడైంది. గడచిన ఆరు నెలల కాలంలో కంపెనీ షేర్ల ధర దాదాపు 25 శాతం క్షీణతను చూసింది.
►ALSO READ | Jhunjhunwala: గంటల్లో రూ.14 కోట్లు సంపాదించిన రేఖా జున్‌జున్‌వాలా.. ఈ స్టాకే కారణం..?
గెలాక్సీ సర్ఫ్యాక్టెంట్స్ సర్ఫ్యాక్టెంట్స్ కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ తయారీ వ్యాపారంలో ప్రముఖ ఆటగాడిగా ప్రపంచ గుర్తింపును తెచ్చుకుంది. ఇంది క్లీనింగ్, పర్సనల్ కేర్ కేటగిరీల్లో అవసరమైన దాదాపు 200 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. అలాగే కంపెనీకి దేశంలో నాలుగు అత్యాధునిక తయారీ యూనిట్లు ఉండగా.. అమెరికా, ఈజిప్టుల్లో ఒక్కో ప్లాంట్లను కలిగి ఉంది. ఈ దేశీయ కంపెనీ ముంబై కేంద్రంగా పనిచేస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.