
నారాయణ్ ఖేడ్, వెలుగు: బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ క్యాండిడేట్ సోమవారం ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి పెద్ద శంకరంపేట ఆరేపల్లి గ్రామంలోని బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, తనకు అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రంలోనే జహీరాబాద్ ను, నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానానికి తీసుకెళ్తానని తెలిపారు.
వలసల నివారణ కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు. వారి వెంట శంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.