బీజేపీలో చేరిన గాలి జనార్ధన్ రెడ్డి..

లోక్ సభ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి తన సొంత గూటికి చేరారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో గాలి జనార్ధన్, ఆయన సతీమని లక్ష్మి కమలం పార్టీలో చేరారు. ఆయన స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష  పార్టీ ( కేఆర్పీపీ)ని బీజేపీలో విలీనం చేశారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి మోదీకి మద్దతు ఇవ్వడానికి తాను తిరిగి సొంతగూటికి వచ్చానని తెలిపారు. అందుకు సంతోషంగా ఉందన్నారు. బేషరతుగా పార్టీలో చేరానని చెప్పారు. తనకు ఎటువంటి పదవులూ అవసరం లేదని చెప్పారు. 

ALSO READ :- లాస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. హైదరాబాద్ నుంచి పోటీ చేసేది ఆయనే..

మొదలు బీజేపి పార్టీలోనే క్రియాశీలకంగా వ్యవహరించిన గాలి జనార్ధనన్ రెడ్డి 2023 కర్ణాటక ఎన్నికలకు ముందు కమల దళం నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు. ఎన్నికల్లో పలు స్థానల్లో కూడా పోటీ చేశారు. కానీ ఆయన ఒక్కరే ఆ పార్టీ నుంచి గెలుపొందారు. చివరకు ఆయన భార్య గాలి అరుణ సైతం బళ్లారి సిటీలో ఓటమి చవిచూశారు. దీంతో కొన్ని రోజులుగా పార్టీ నెట్టుకొచ్చిన ఆయన ఇవాళ బీజేపీలో విలీనం చేశారు.