ఉద్యోగాలు చేసే ఆడవాళ్లకు ఇంటి పని తలకు మించిన భారమే. ఉదయం లేవగానే కిచెన్‌లో యుద్ధాలు చేయాలి. ఎక్కువ పనులుంటే కొందరు మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. పొయ్యి మీద పాలు పెట్టి.. కూరగాయలు కట్ చేయడం, పిల్లలను స్కూల్‌కు రెడీ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల కోసమే ఈ గాడ్జెట్స్. వీటిని వాడి కొన్ని పనులు ఈజీగా, తక్కువ టైంలో చేసుకోవచ్చు.
పొంగనివ్వదు
బ్యాచిలర్స్, వర్కింగ్ విమెన్‌కి పాలు మరిగించడం కూడా చాలా పెద్ద పని. ఎందుకంటే.. పాలు వేడెక్కినప్పటి నుంచి పొయ్యి దగ్గరే ఉండాలి. లేదంటే పొంగి, వంట గట్టంతా పాడవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? పాల మీద మూత తీసేసి ఈ సిలికాన్ స్పిల్ స్టాపర్‌ని పెడితే చాలు. ఇది పొంగిన పాలను ఒలికి పోకుండా ఆపేస్తుంది. ఫోమ్‌ని మాత్రమే పైకి పంపుతుంది. దాన్ని కూడా కింద పడకుండా అడ్డుకుంటుంది. ఇది కూరగాయలు, స్వీట్‌పొటాటో లాంటివాటిని ఆవిరిపై ఉడికించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది.
ధర: 294 రూపాయలు
బరువు కొలిచే స్పూన్
వంట వండడంలో బేసిక్స్ తెలియని వాళ్లు కూడా టేస్టీగా వండేస్తున్నారు ఈమధ్య. యూట్యూబ్‌లో సెర్చ్ చేయడం, కావాల్సినవి తెచ్చుకుని వండుకోవడం చాలామందికి అలవాటైపోయింది. అలాంటివాళ్లకు వచ్చే పెద్ద సమస్య.. వంట పదార్థాలను కొలవడం. ఎందుకంటే.. వంటల వీడియోల్లో పదార్థాలను కచ్చితమైన క్వాంటిటీలో వేయాలని చెప్తుంటారు. అలాగని ప్రతి వస్తువుని కొలవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఇలాంటి డిజిటల్ వేయింగ్ స్పూన్ కొనుక్కోవాలి. ఈ స్పూన్‌లోకి ఇంగ్రెడియెంట్‌ని తీసుకోగానే దాని బరువు డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ఇది 0.1 గ్రాము నుంచి 500 గ్రాముల వరకు కొలవగలదు. దీన్ని వాడడం ఆపేసి పక్కన పెడితే 180 సెకన్లకు ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. స్పూన్‌లో వెయిట్ పడగానే ఆటోమెటిక్‌గా ఆన్ అవుతుంది.
ధర: 345 రూపాయలు
కార్న్ పీలర్
వానాకాలం అంటేనే స్వీట్‌కార్న్ సీజన్. ఈ సీజన్‌లో మొక్కజొన్న కంకులు మార్కెట్‌లో బాగా దొరుకుతాయి. ఎక్కువమంది ఈ సీజన్‌లో గారెలు కూడా చేసుకుంటారు. కానీ.. కార్న్‌తో ఏ వెరైటీ చేసుకోవాలన్నా గింజలు ఒలవడం పెద్ద టాస్క్. ఈ టాస్క్‌ని ఈజీగా కంప్లీట్ చేయాలంటే ఈ పీలర్ వాడాలి. దీంతో గింజలు ఒలవడం చాలా ఈజీ. ఒలిచిన గింజల కోసం ప్రత్యేకంగా ఒక ప్లాస్టిక్ గిన్నె కూడా దీనికి ఎటాచ్ చేసి ఉంటుంది. మార్కెట్‌లో రకరకాల పీలర్లు, వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
ధర: 100 రూపాయల నుంచి మొదలు
హెర్బ్ సీజర్
బీన్స్, చిక్కుడు, ఆకుకూరలు కట్ చేయడం లాంటి పనులు ఎక్కువ టైం తీసుకుంటాయి. అందుకే కొందరు ముందు రోజు రాత్రి తరిగి ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. ఈ కత్తెర ఉంటే.. అప్పటికప్పడు నిమిషాల్లో తరిగేయొచ్చు. కత్తితో తరిగితే.. కొన్ని ముక్కలు చిన్నగా, కొన్ని ముక్కలు పెద్దగా వస్తాయి. కానీ.. ఈ కత్తెర అన్ని ముక్కలను సమానంగా తరుగుతుంది. కొత్తిమీర, ఉల్లికాడలు, బెండకాయలు, పచ్చిమిర్చి లాంటివాటిని కూడా ఈజీగా తరగొచ్చు.
ధర: 245 రూపాయలు