టూరిస్ట్ స్పాట్​గా గల్వాన్ వ్యాలీ

  • కార్గిల్, సియాచిన్ సహా 77 యుద్ధ క్షేత్రాలు చూడొచ్చు
  • భారత్ రణభూమి దర్శన్ పేరిటవెబ్​సైట్ లాంచ్

న్యూఢిల్లీ: ఇప్పటివరకు సైన్యానికి మాత్రమే ఎంట్రీ ఉన్న మన దేశ బార్డర్లు, యుద్ధక్షేత్రాలు ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా వెల్​కమ్ చెప్తున్నాయి. కార్గిల్, సియాచిన్, గల్వాన్, డోక్లామ్, రాజస్థాన్​లోని లాంగేవాలా, అరుణాచల్ ప్రదేశ్​లోని కిబితూ, బమ్​లాతోసహా మొత్తం 77 చారిత్రక యుద్ధభూమి ప్రాంతాలను సందర్శించేందుకు టూరిస్టులకు అవకాశం కల్పిస్తోంది. బార్డర్లు, బ్యాటిల్​ఫీల్డ్స్ ను ప్రతిఒక్కరూ సందర్శించేలా కేంద్ర ప్రభుత్వం రణభూమి దర్శన్​ను ప్రారంభిస్తోంది. 77వ ఆర్మీ డేను పురస్కరించుకుని టూరిజం శాఖతో కలిసి రక్షణ మంత్రిత్వ శాఖ రణభూమి దర్శన్ వెబ్​సైట్​ను లాంచ్ చేయనుంది. ఇందులో పర్యాటకుల కోసం తెరిచే 77 యుద్ధ ప్రాంతాలకు సంబంధించిన వివరాలు, సందర్శించేందుకు అనుమతులు, ఎలా పర్యటించాలి, ప్రయాణ సౌలత్​లు, ఇతర అవసరాలతో పాటు యుద్ధ స్మారక ప్రాంతాలు.. చిహ్నాలకు సంబంధించిన అన్ని వివరాలను ఈ వెబ్​సైట్​లో పొందుపర్చనున్నారు. ‘‘బార్డర్​లను, బ్యాటిల్​ఫీల్డ్స్​ను పర్యాటక ప్రాంతాలుగా మారుస్తున్నం. దీనిద్వారా వీరుల శౌర్యాన్ని, మాతృభూమి కోసం వీర సైనికులు పోరాడిన యుద్ధక్షేత్రాలను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తున్నం”అని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.