
ఫిబ్రవరి 16న GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ అజ్మాన్, దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దుబాయ్‌లో నివసిస్తున్న 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. మొట్టమొదటి సారిగా, సరికొత్తగా, వినూత్నంగా ఈ గ్రాండ్ రివీల్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు.
ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ డేట్, వెన్యూ మరియు జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. GAMA అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ తేదీ (జూన్ 7, 2025) దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు - ఏ. కొదండ రామిరెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు - కోటి , ప్రముఖ సినీ దర్శకులు బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ నటీనటులకు, సినిమాలకు GAMA అవార్ద్స్ అందిస్తారు.
GAMA AWARDS చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త "కేసరి త్రిమూర్తులు" మాట్లాడుతూ, GAMA విజయవంతంగా 4 ఎడిషన్లు పూర్తి చేసుకుందని తెలిపారు. జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్ కు ప్రముఖ సినీ పెద్దలను,కళాకారులను విశిష్ట అతిధులుగా ఆహ్వానించాలనుకున్నామని ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలిపారు.
UAEలోని తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలుగు సినీ ప్రముఖులకు పేరుపేరునా కేసరి త్రిమూర్తులు కృతజ్ఞతలు చెప్పారు.