ఆస్ట్రేలియాతో ఆదివారం (జనవరి 5) భారత్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజార్చుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో భారత్ పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. 2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ కఠిన సవాలుకు ముందు భారత జట్టుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లను దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు.
"జట్టులో ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ ఆడాలి. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోతే, టెస్టు క్రికెట్‌లో మీరు కోరుకున్న ఆటగాళ్లను ఎప్పటికీ పొందలేరు". అని గంభీర్ తెలిపాడు. సీనియర్ ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ ఫామ్ గురించి తనకు ఆందోళన లేదని.. వారు పరుగులు చేయడానికి ఇంకా ఆకలితో ఉన్నారని గంభీర్ మద్దతు పలికాడు. కోహ్లీ, రోహిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.
Also Read :- రోహిత్, గంభీర్‌లకు బీసీసీఐ గుడ్ బై..?
టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే 162 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఖవాజా(41), హెడ్ (35), వెబ్ స్టర్ (30) బ్యాటింగ్ లో రాణించడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో భారత్ ఓడిపోవడంతో భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 157 పరుగులకు ఆలౌట్ అయింది.