ఓవర్సీస్ లో మొదలైన తెలుగు సినిమాల జాతర.. టికెట్ బుకింగ్స్ రిలీజ్..

ఓవర్సీస్ లో మొదలైన తెలుగు సినిమాల జాతర..  టికెట్ బుకింగ్స్ రిలీజ్..

ఇయర్ ఎండ్ కావడంతో అప్పుడే ఓవర్సీస్ లో సంక్రాంతి తెలుగు సినిమాల సందడి మొదలైంది. అయితే ఈసారి టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన "గేమ్ ఛేంజర్", నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన "డాకూ మహారాజ్", విక్టరీ వేంకటేష్ - అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన "సంక్రాంతికి వస్తున్నాం" తదితర సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నాయి. 

దీంతో ఎప్పటిలాగే లోకల్ గా కాకుండా ఈసారి మేకర్స్ ఓవర్సీస్ లో సినిమాలని ప్రమోట్ చేసేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ యూఎస్ఏ లో ప్లాన్ చేశారు. ఇందులో ఇప్పటికే గేమ్ ఛేంజర్ ఈవెంట్ ని డల్లాస్ లో నిర్వహించగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక డాకూ మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జనవరిలో జరగనుంది.

అయితే గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్రయూనిట్ ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్స్ రిలీజ్ చేశారు. యూఏఇలో టికెట్స్ బుకింగ్స్ కోసం వెబ్ సైట్ లింక్ కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే యూఏఇలో గేమ్ ఛేంజర్ సినిమాని 3 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

యూఏఇలో గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


ఇక బాలకృష్ణ డాకూ మహారాజ్ కూడా జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో యూఎస్ఏ లో టికెట్ బుకింగ్స్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన  ప్రగ్య జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ విలన్ గా నటించగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రముఖ మోడల్, నటి ఊర్వశి రౌటేలా నటించింది. ఇటీవలీయే సినిమాలోని గ్లింప్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.