మెగా హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సఫీస్ వద్ద అనుకున్న కలెక్షన్లు రాబట్టలేక పోయింది. ఈ సినిమా రూ.220 కోట్లకు ప్రీరిలీజ్ చేసింది.
అయితే,బ్రేక్ ఈవెను కోసం మరో రూ.222 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ 11 రోజులు వ్యవధిలో రూ.127.15 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే మరో రూ.130 కోట్లకి పైగా షేర్ ను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
సాక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం:
ఈ 12రోజుల కలెక్షన్లను గమనిస్తే.. నైజాం రూ.19.05 కోట్లు, సీడెడ్ రూ.10.31 కోట్లు. ఉత్తరాంధ్ర రూ.10.23 కోట్లు, రస్ట్ రూ.6.20 కోట్లు, వెస్ట్ రూ.4,06 కోట్లు, కృష్ణా రూ.5.23కోట్లు, గుంటూరు రూ.6.19 కోట్లు, నెల్లూరు రూ.1.58 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఏపీ తెలంగాణ కలుపుకొని మొత్తం రూ. 64.85 కోట్లు, కర్ణాటక రూ.4.85 కోట్లు, తమిళనాడు రూ.3.59 కోట్లు, కేరళ రూ.0.26 కోట్లు, ఓవర్సీస్ రూ.14.05 కోట్లు, నార్త్ రూ.14.20 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే, గ్రాస్ కలెక్షన్స్ ఎంతనేది మేకర్స్ వెల్లడించలేదు.
ఇక గేమ్ ఛేంజర్ 11 వ రోజుల కలెక్షన్స్ వివరాల్లోకెళ్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.0.7 కోట్లు, తమిళ్‌లో రూ.4లక్షలు, హిందీలో రూ.0.25 లక్షలు , కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో రూ.12 లక్షల చొప్పున ఇలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1.1 కోట్ల వసూల్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ 11 రోజుల్లో ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.127కోట్ల నెట్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.