Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!

Game Changer: గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!

రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్, సాంగ్స్, టీజర్ విజువల్స్ రిచ్గా ఉన్నాయి.

వినయ విధేయ రామ తర్వాత.. సుమారు ఐదేళ్లకు రామ్‍చరణ్ సోలో హీరోగా గేమ్ ఛేంజర్తో వస్తున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ సినిమాకు దిల్ రాజు పెట్టిన బడ్జెట్ ఎంత? రిలీజ్కు ముందు చేసిన బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత రాబట్టాలి? అనే వివరాలు చూద్దాం. 

నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.300-450 కోట్ల బడ్జెట్తో గేమ్ ఛేంజర్ నిర్మించినట్లు టాక్. ఇందులో ప్రమోషన్ ఖర్చులు, ఈవెంట్స్, రెమ్యునరేషన్, ప్రొడక్షన్స్ ఖర్చులు ఇలా అన్ని కలుపుకుని మొత్తం రూ.500కోట్ల బడ్జెట్ ని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రికార్డ్ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు రూ.200 కోట్లు వెచ్చించి మరి సౌత్,నార్త్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇకపోతే గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన‌ట్లు సమాచారం. 

ఇక ఈ భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాక.. థియేట్రికల్ రన్ నుంచి గేమ్ ఛేంజర్ రూ.300 కోట్ల మేరకు రాబట్టాల్సి ఉంటుంది. మరి మొత్తంలో మొత్తం బ్రేక్ ఈవెన్ టార్గెట్ టచ్ చేయాలంటే తెలుగు రాష్ట్రాలలో రూ.130 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అలాగే పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అవుతుంది కనుక (తమిళ, కన్నడ, ఓవర్సీస్, నార్త్  కలిపి) రూ.150-200 కోట్ల వరకు వసూళ్లు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. పుష్ప 2 మాదిరి  గేమ్ ఛేంజర్ హిందీ బెల్ట్లో విజృంభణం చేస్తే భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది. మరి ఏమవుతుందో చూడాలి. 

ఇకపోతే.. గేమ్ ఛేంజర్ లోని పాటల చిత్రీకరణకు శంకర్ భారీ స్థాయిలో ఖర్చు పెట్టినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్‌లోని జరగండి పాటని రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. రెండవ పాట రా మచ్చా పాట 23 కోట్ల రూపాయల బడ్జెట్, మూడో పాటకు 15 కోట్ల బడ్జెట్‌తో చిత్రీకరికంచినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఏదేమైనా శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీకి భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు.