GameChanger: గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్‌తో సంతృప్తి లేనని దర్శకుడు శంకర్ కామెంట్స్.. విపరీతంగా నెటిజన్ల ట్రోలింగ్

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి బాక్సాఫీస్ ఆఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజైన (జనవరి 10న) ఫస్ట్ షోకే అలోమోస్ట్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓ వైపు థియేటర్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్, మరో వైపు ఆన్ లైన్లో హెచ్డీ ప్రింట్ దర్శనం, పేలవమైన కలెక్షన్స్.. ఇలా ప్రతిదీ సినిమాకు మైనస్ గా నిలిచాయి. 

ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ సినిమా రెస్పాన్స్ పై నోరు విప్పారు. ఇప్పుడు అది కాస్తా సంచలన కామెంట్స్ అని చెప్పుకునేలా మారిపోయింది. దాంతో దర్శకుడు శంకర్ చేప్పిన విషయాలపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి తనకు ఎదురైన ప్రశ్న ఏంటీ? చెప్పిన సమాధానం ఏంటనే వివరాల్లోకి వెళితే.. 

లేటెస్ట్గా కొరియోగ్రాఫర్ కాలాకి  ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఏవైనా (యూట్యూబ్, ఆన్‍లైన్ రివ్యూలు) చూశారా.. విన్నారా అని డైరెక్టర్ శంకర్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. తాను ఏ రివ్యూలు కూడా చూడలేదని, అయితే సినిమాకు అన్నిచోట్లా మంచి రివ్యూలే వస్తున్నాయని మాత్రం తనకు వినిపిస్తోందని చెప్పారు.

అంతేకాకుండా " సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌తో నేను పూర్తిగా సంతృప్తి చెందలేదు. నేను ఇంకా బాగా చేసి ఉండాలనుకున్నాను. అసలు ఈ మూవీకి మొత్తంగా 5 గంటల ఫుటేజ్ వచ్చిందని.. ఆపై రన్‍టైమ్ తగ్గించేందుకు ట్రిమ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, ట్రిమ్ చేసిన వాటిలో చాలా ముఖ్యమైన ప్రభావవంతమైన ఎపిసోడ్స్ తీసేయాల్సి వచ్చిందని" డైరెక్టర్ శంకర్ అన్నారు.

ALSO READ | Oscars 2025: ఆస్కార్కు అంటుకున్న కార్చిచ్చు.. నామినేషన్లు జనవరి 23కు వాయిదా

దీంతో శంకర్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ వైపు పూర్తి నెగిటివ్ టాక్ తో సినిమా పనై పోయిందని అంటుంటే.. రివ్యూ వినలేదని అలా ఎలా అంటారంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాలో 5 గంటల కథ ఏముందని తీశారు? ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కేంచే ముందు ఓ ఫ్లోలో ఉండేలా చూసుకోవాలనే బాధ్యత డైరెక్టర్ దే కదా అని మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. 

అంతేకాదు.. గేమ్ ఛేంజర్ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో నాల్గవ బెస్ట్ ఓపెనింగ్స్ అని చిత్ర నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు.  అయితే ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లను కూడా అందుకోలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరింత ఆగ్రహానికి గురవుతున్నారు ఫ్యాన్స్.

గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద మొదటి 4 రోజులలో చాలా తక్కువ స్క్రీనింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఇండియా వైడ్ గా రూ.96.15 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గేమ్ ఛేంజర్ 5వ రోజు మంగళవారం జనవరి 14న బాక్సాఫీస్ కలెక్షన్ బట్టి రూ.106.15 కోట్ల వసూళ్లు చేయొచ్చని అంచనా వస్తున్నాయి.