DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం

DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం

గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం (జనవరి 4న) రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయాక తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌మాద‌వశాత్తు ఇద్దరు రామ్ చరణ్ అభిమానులు మరణించారు.

కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌(22) బైక్ పై వెళుతుండగా ఆక్సిడెంట్ అవ్వడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు చనిపొవడంతో గేమ్ ఛేంజర్ యూనిట్కు షాక్ కి గురిచేసింది. ఈ ఘ‌ట‌న వివరాలు తెలుసుకున్న గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు వెంట‌నే స్పందించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు చెరో ఐదు లక్షల చొప్పున రూ.10 లక్షల సాయం ప్రకటించారు. 

Also Read : ప్లీజ్.. ప్లీజ్ టికెట్ రేట్లు పెంచండి 

ఇవాళ (జనవరి 6న) మీడియా సమక్షంలో దిల్ రాజు మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘ‌నంగా జ‌రిగింది. ఆ విష‌యంపై మేం సంతోషంగా ఉన్న స‌మ‌యంలో ఇలా ఇద్ద‌రు రామ్ చరణ్ అభిమానులు తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం. వారి కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాల‌కు చెరో రూ.5ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను. వారికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను" అని  దిల్ రాజు అన్నారు.