అన్‌స్టాపబుల్‌ షోలో డాకు మహారాజ్ తో సందడి చెయ్యనున్న గేమ్ ఛేంజర్..

అన్‌స్టాపబుల్‌ షోలో డాకు మహారాజ్ తో సందడి చెయ్యనున్న గేమ్ ఛేంజర్..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ టీమ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో సందడి చెయ్యనున్నారు.

దీంతో హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ తదితరులు బాలకృష్ణతో కలసి ఫ్యాన్స్ ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ మంగళవారం మొదలై ఒకే రోజులో పూర్తీ కానుంది. అయితే ఇప్పటివరకూ రామ్ చరణ్ ఇతర టాక్ షోలలో పాల్గొన్నప్పటికీ బాలయ్యతో కలసి మొదటిసారి అన్ స్టాపబుల్ షోలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అంతేగాకుండా బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాకూడా జనవరి 14న రిలీజ్ అవుతూ సంక్రాంతి బరిలో దిగనుంది. దీంతో అభిమానులు ఈ ఎపిసోడ్  గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ | సరదాగా చేసే పనులతో ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త అంటున్న హీరో నిఖిల్

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే హీరో విక్టరీ వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" చిత్ర యూనిట్ తో వచ్చి అన్‌స్టాపబుల్‌ విత్  ఎన్బీకేలో సందడికి చేశాడు. ఈ ఎపిసోడ్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ ఆహా ఓటిటి లో ప్రసారమవుతోంది.