Game Changer: గేమ్ ఛేంజర్ 4 పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు.. ఏ పాటకి ఎంతో తెలుసా?

Game Changer: గేమ్ ఛేంజర్ 4 పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు.. ఏ పాటకి ఎంతో తెలుసా?

ఇండియా సినీ సర్కిల్ లో తెలుగు సినిమాల సౌండ్ వినిపిస్తోంది. డిసెంబర్ నెల అంత పుష్ప 2 ఫీవర్ నడవగా.. ఇప్పుడు జనవరి నెలలో గేమ్ ఛేంజర్ (Game Changer) హవా మొదలైంది. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్స్ కేకుల్లా అమ్ముడవుతూ రికార్డ్ దిశగా వెళుతోంది. ఇక సాంగ్స్, ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ అప్డేట్స్తో గేమ్ ఛేంజర్ మోత మోగిపోతుంది. 

ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి రిలీజైన సాంగ్స్ చార్ట్ బ్లాస్టర్ లిస్టులో ఉన్నాయి. శంకర్ మార్క్ విజువల్స్, రామ్ చరణ్, కియారా లుక్స్, డ్యాన్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే, డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 4 సాంగ్స్ కోసమే దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారంట. అందులోని ప్రతి సాంగ్ విశేషాలు, బడ్జెట్ వివరాలు చూద్దాం. 

జరగండి జరగండి సాంగ్:

రచయిత అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను.. డాలర్ మెహందీ, సునిది చౌహాన్ పాడారు. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఎంతో కలర్ ఫుల్ గా, గ్రాండియర్ గా  ఉన్న ఈ పాట సినిమాకే హైలెట్ కానుందని టాక్.

ఈ పాటని 13 రోజుల పాటు 600 మంది డ్యాన్సర్‌లతో ప్రభుదేవా మాస్టర్ రూపొందించారట. అంతేకాకుండా భారీ 70 అడుగుల కొండ గ్రామం యొక్క కాస్ట్యూమ్స్ ఎకో-ఫ్రెండ్లీ, జూట్ లాంపనార్‌తో తెరకెక్కడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పాట కోసం రూ.20కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 

రా మచ్చా మచ్చా:

రచయిత అనంత శ్రీరామ్ రాసిన రా మచ్చా మచ్చా పాటను..నకాష్ అజీజ్ పాడారు. స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఎంతో కలర్ ఫుల్గా, గ్రాండియర్ గా ఉన్న ఈ పాటలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే, ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ALSO READ | Dilruba: ప్రేమ అనేది మోస్ట్ అడిక్ట్ డ్రగ్..ఆసక్తిగా కిరణ్ అబ్బవరం దిల్ రూబా కాన్సెప్ట్ వీడియో

ఈ పాట‌లో ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు ఇందులో భాగ‌మ‌వ‌టం విశేషంగా ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంస్కృతుల‌ను బేస్ చేసుకుని ఈ పాట‌ను శంక‌ర్ వినూత్నంగా రూపొందించారు. 

ఏపీలోని విభిన్నమైన నృత్య రీతులలో ఎంతో గుర్తింపు పొందిన 'గుసాడి, కొమ్ము కోయ‌, త‌ప్పెట గుళ్లు' వంటి జాన‌ప‌ద నృత్యాల‌తో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి, ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా ఈ సాంగ్‌లో మమేకం చేశారంటూ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మేకర్స్ చెప్పుకొచ్చారు. 
అయితే రా మచ్చా పాట కోసం 23 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.  

నానా హై రానా:

తమన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌‌‌‌లో రామ్ చరణ్, కియారా కూల్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ‘నానా హైరానా.. ప్రియమైన హైరానా.. నానా హైరానా.. అరుదైన హైరానా.. నెమలి ఈకలు పులికింతై నా చెంపలు నిమిరేనా.. వందింతలైన నా అందం.. నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం’ అంటూ సాగిన పాటకు రామజోగయ్య శాస్త్రి అందమైన లిరిక్స్ రాయగా, కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడిన తీరు ఆకట్టుకుంది. బోస్కో మార్టిస్  కొరియోగ్రాఫర్ చేశారు. అయితే, ఈ పాట కోసం రూ.10 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.  

ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన మొదటి భారతీయ పాట ఇది కావడం విశేషం. పాశ్చాత్య మరియు కర్నాటిక్ సంగీతం యొక్క విశిష్ట సమ్మేళనం మేళవించిన ఈ పాటను న్యూజిలాండ్ లో తెరకెక్కించారు. 

దోప్‌‌ సాంగ్:

నాలుగోవ పాటగా వచ్చిన ‘దోప్‌‌’ ఒక హై-ఎనర్జీ టెక్నో గీతంగా వచ్చింది. తమన్ కంపోజ్ చేయడంతో పాటు జేకేవీ రోషిణి, పృథ్వి శ్రుతి రంజనితో కలిసి పాడాడు. రామజోగయ్య శాస్త్రి  లిరిక్స్ రాశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

అయితే, శంకర్ పాటలకి పెట్టిన ఖర్చుతో ఓ పెద్ద హీరోతో సినిమానే తీయొచ్చు. ఏదేమైనా శంకర్ ఆలోచనలకి అడ్డుపడే టాలెంట్ మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే, అంత గ్రాండియర్ గా తన ఆలోచనలు ఉంటాయి కాబట్టి. 

నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.300-450 కోట్ల బడ్జెట్తో గేమ్ ఛేంజర్ నిర్మించినట్లు టాక్. ఇందులో ప్రమోషన్ ఖర్చులు, ఈవెంట్స్, రెమ్యునరేషన్, ప్రొడక్షన్స్ ఖర్చులు ఇలా అన్ని కలుపుకుని మొత్తం రూ.500కోట్ల బడ్జెట్ ని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది.