పవన్ ని కలసిన దిల్ రాజు.. గేమ్ ఛేంజర్‌ టికెట్ రేట్ల గురించేనా.?

పవన్ ని కలసిన దిల్ రాజు.. గేమ్ ఛేంజర్‌ టికెట్ రేట్ల గురించేనా.?

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా దిల్ రాజు పుష్ప గుచ్చం అందజేశారు. అయితే జనవరి  4, 5 తేదీల్లో విజయవాడలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరవహించనున్నారు. దీంతో ఈ ఈవెంట్ పర్మిషన్స్ అలాగే ఏర్పాట్ల విషయమై పవన్ తో దిల్ రాజు చర్చించారు. అలాగే జనవరి 10న దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరలపై కూడా చర్చించినట్లు సమాచారం.

Also Read : గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ఛీఫ్ గెస్ట్..?

గతంలో పుష్ప 2 సినిమా నిర్మాతలు కూడా టికెట్ ధరల విషయమై పవన్ కలవగా సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపుకి అనుమతులు ఇచ్చారు. కానీ పుష్ప 2 ప్రీమియర్స్ సదంర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటనలు పుష్ప 2 టీమ్ కి చేదు జ్ఞాపకంగా మిగిలాయి. మరి ఏపీలో గేమ్ ఛేంజర్ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.