GameChanger: గేమ్ ఛేంజర్ క్రేజీ అప్డేట్..మెగా బాణసంచాకు సిద్దమవుతున్న మేకర్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పోటికల్ థ్రిల్లర్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ‘రాయన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అభిమానులు ఆ రిలీజ్ విషయమై అడగ్గా నిర్మాత దిల్‌ రాజు స్పందిస్తూ..క్రిస్మస్‌కు కలుద్దామంటూ అప్‌డేట్‌ ఇచ్చారు.

Also Read:- వయనాడ్‌ విషాదం.. ప్రభాస్‌ భారీ విరాళం 

తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. " గేమ్ ఛేంజర్ బృందం డబ్బింగ్ పనులను ప్రారంభించింది..మెగా బాణసంచా క్రిస్మస్ 2024 కోసం అంతా సిద్ధంగా ఉంది" అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఎట్టకేలకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షురూ కావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ (Thaman) గేమ్‌ ఛేంజర్‌ పనులను ఆగస్ట్ లో షురూ చేస్తానంటూ తెలిపారు. ‘జరగండి.. జరగండి..’ అంటూ రామ్‌చరణ్‌తో కలిసి కియారా చేసిన సందడి తెలిసిందే. 

ఈ సినిమాలో అంజలి, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.