రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్ వచ్చేసింది..

రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..  గేమ్ ఛేంజర్ టీజర్ అప్డేట్ వచ్చేసింది..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్  దర్శకత్వం వహిస్తున్న "గేమ్ ఛేంజర్" చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ నటిస్తుండగా ఎస్. జె సూర్య, శ్రీకాంత్ అజయ్, అన్వీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ALSO READ | Tollywood Movies: దీపావళి స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజ్

ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుంచి 2 పాటలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడు వస్తుందా అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయితే దీపావళి పండగ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా నవంబర్ 9న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ  విషయనికి సంబందించిన పోస్టర్ ని కూడా షేర్ చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ రైల్వే ట్రాక్ పై కూర్చుని రెబల్ లుక్ లో కనిపించాడు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా గేమ్ ఛేంజర్ ఈ ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ కావలసి ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి హరోగా నటించిన విశ్వంభర సంక్రాంతి బరినుంచి తప్పుకోవడంతో     గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముదనుకు రాబోతోంది.