మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ దర్శకత్వం వహిస్తున్న "గేమ్ ఛేంజర్" చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ నటిస్తుండగా ఎస్. జె సూర్య, శ్రీకాంత్ అజయ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తుండగా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్ డ్రామా బ్యాకక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈరోజు చిత్ర యూనిట్ "ఉత్తరప్రదేశ్ లక్నోలో నవంబర్ 9న గేమ్ ఛేంజర్ తీసుకునే ఛార్జ్ కోసం సిద్ధంగా ఉండండి.." అంటూ మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్, లాంచ్ ఈవెంట్ ప్లేస్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా టీజర్ పై ఆసక్తి నెలకొంది.
అయితే గేమ్ ఛేంజర్ టీజర్ ని రెండు నిమిషాల నిడివి లోపు కట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టీజర్ లో ఎక్కువగా పొలిటికల్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో టీజర్ రిలీజ్ అయిన తర్వాత గేమ్ మొత్తం ఛేంజ్ అయిపోతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ టీజర్ అన్ ప్రిడిక్టబుల్ గా ఉండబోతోందని రికార్డులు బద్దలవ్యవడం ఖాయమని అంటున్నారు.
Ready, Set... Command 😎
— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2024
Get ready for #GameChanger ‘s charge in Lucknow ❤️🔥🧨#GameChangerTeaser launch event on 9th NOVEMBER in Lucknow, UP.#GameChanger takes charge in theatres on JAN 10th ❤️🔥
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah… pic.twitter.com/gq9LXHCs1y
ఈ విషయం ఇలా ఉండగా రామ్ చరణ్ దాదాపుగా 5 ఏళ్ల తర్వాత పెర్ఫార్మెన్స్ తో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతకుముందు నటించిన రంగస్థలం ఫర్వాలేదనిపించినప్పటికీ, వినయవిధేయ రామ మాత్రం ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ సినిమాతోహిట్ కొట్టాలని రామ్ చరణ్ బాగానే కష్టపడ్డాడు. అయితే గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.