GameChanger: థియేట‌ర్ల‌లో నానా హైరానా సాంగ్ మిస్‌.. రామ్ చరణ్ ఫ్యాన్స్కు మేకర్స్ క్లారిటీ

ఇండియా సినీ సర్కిల్లో సంక్రాంతి తెలుగు సినిమాల సౌండ్ వినిపిస్తోంది. డిసెంబర్ నెల అంత పుష్ప 2 ఫీవర్ నడవగా.. ఇవాల్టీ నుంచి (జనవరి 10న) గేమ్ ఛేంజర్ (Game Changer) హవా మొదలైంది. ఇప్పటికే ఇండియా, ఓవర్సీస్లో టికెట్స్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

నేడు భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు వేరే హీరోల అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోన్నప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం తగ్గేదేలే అనేలా సందడి చేస్తున్నారు.

అయితే, గేమ్ ఛేంజర్లోని మెలోడీ సాంగ్‌‌‌‌ నెంబర్ ‘నానా హైరానా' లేదట. టెక్నిక‌ల్ ఇష్యూస్ కార‌ణంగా నానా హైరానా సాంగ్‌ను థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డంతో మెగా ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయ్యారు. చరణ్, కియారా మెలోడీ స్టెప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్కి.. పాట లేకపోవడంతో బాగా హర్ట్ అయ్యారు. దాంతో నానా హైరానా సాంగ్ ఎక్కడ? అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంతో.. మేక‌ర్స్ తాజాగా స్పందించారు. 

Also Read : గేమ్ ఛేంజ‌ర్ X రివ్యూ.. రామ్‌చ‌ర‌ణ్-శంక‌ర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?

 "ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన మొదటి భారతీయ పాట ఇది. అయితే, ప్రారంభ ప్రింట్లలో ఇన్ఫ్రారెడ్ చిత్రాల ప్రాసెసింగ్ సమయంలో ఎదురైన సాంకేతిక సవాళ్ల కారణంగా ఈ పాట ఎడిట్ చేయబడింది. నిశ్చింతగా ఉండండి. బ్లాక్‌బస్టర్ మెలోడీ ఆఫ్ ది ఇయర్‌తో మీరందరూ వైబ్ చేసే వరకు వేచి ఉండలేము.. జ‌న‌వ‌రి 14 నుంచి నానా హైరానా సాంగ్ వచ్చే కంటెంట్‌లో థియేట‌ర్ల‌లో తిరిగి జోడించడానికి సిద్ధం ! అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు వెల్లడించారు. 

ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి రిలీజైన సాంగ్స్ చార్ట్ బ్లాస్టర్ లిస్టులో ఉన్నాయి. శంకర్ మార్క్ విజువల్స్, రామ్ చరణ్, కియారా లుక్స్, డ్యాన్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే, డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 4 సాంగ్స్ కోసమే దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారంట.

నానా హై రానా:

తమన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌‌‌‌లో రామ్ చరణ్, కియారా కూల్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ‘నానా హైరానా.. ప్రియమైన హైరానా.. నానా హైరానా.. అరుదైన హైరానా.. నెమలి ఈకలు పులికింతై నా చెంపలు నిమిరేనా.. వందింతలైన నా అందం.. నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం’ అంటూ సాగిన పాటకు రామజోగయ్య శాస్త్రి అందమైన లిరిక్స్ రాయగా, కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడిన తీరు ఆకట్టుకుంది. బోస్కో మార్టిస్  కొరియోగ్రాఫర్ చేశారు. అయితే, ఈ పాట కోసం రూ.10 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.  

ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన మొదటి భారతీయ పాట ఇది కావడం విశేషం. పాశ్చాత్య మరియు కర్నాటిక్ సంగీతం యొక్క విశిష్ట సమ్మేళనం మేళవించిన ఈ పాటను న్యూజిలాండ్ లో తెరకెక్కించారు.