దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అయితే.. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజుకి తలనొప్పిగా మారింది. తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ తో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద తిప్పలు తప్పవని అనిపిస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణాలో గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సినీ పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన దిల్ రాజు.. గేమ్ చేంజర్ టికెట్ రేట్ల విషయమై మరోసారి సీఎంను కలవాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. సీఎం రేవంత్ ను కలిసి గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తానని తెలిపారు దిల్ రాజు.
Also Read : హీరో విశాల్ ఆరోగ్యం బాగానే ఉందా
టికెట్ రేటు పెంచడం వల్ల 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుందని.. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలని అన్నారు దిల్ రాజు. తెలుగు సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి అందుకే ప్రపంచ ఖ్యాతి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారని.. సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అన్నారని.. ఆ ఆశతో మళ్లీ సీఎం ని కలుస్తానని అన్నారు దిల్ రాజు. మరి, సీఎం రేవంత్ దిల్ రాజు రిక్వెస్ట్ ని పరిగణలోకి తీసుకొని గేమ్ చేంజర్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తారా లేదా వేచి చూడాలి.