
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి తమిళ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ తో టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇటీవలే చిత్ర యూనిట్ ఈ చిత్రంలోని సెకెండ్ సింగిల్ రా మచ్చా సాంగ్ ప్రోమో ఈ నెల 30వ తారిఖున విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో గేమ్ ఛేంజర్ సెకెండ్ సింగిల్ సాంగ్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
అయితే ఈ సాంగ్ గురించి డైరెక్టర్ శంకర్ స్పందించాడు. ఇందులో భాగంగా ఈ పాట కోసం వివిధ రాష్ట్రాల్లోని సంగీతం, సంస్కృతిపై పరిశోధన చేశానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోఆంధ్రప్రదేశ్ కి చెందిన గుస్సాడి, కొమ్ముకోయ, తప్పెట గుల్లు అలాగే ఒడిశా కి సంబంధించిన పైకా, రణప, ఘుమ్రా, మరియు కర్ణాటకకి చెందిన హల్లకి, గొరవరా, ఛౌ (పశ్చిమ బెంగాల్) తదితర డ్యాన్స్ సంస్కృతులను జోడించి చిత్రీకరించామని తెలిపారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి మ్యూజిక్ ని అందించగా గణేష్ ఆచార్య మాస్టారు డ్యాన్స్ స్టెప్పులను కంపోజ్ చేశారని వెల్లడించాడు.
ఇక ఈ సాంగ్ గురించి తమన్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి రాయలసీమ చివరి వరకు అన్ని సంస్కృతులను పరిశిలించి దాదాపుగా 1000 మంది డ్యాన్సర్లతో పాటను చిత్రీకరించామని తెలిపాడు. కచ్చితంగా ఈ సాంగ్ ప్రేక్షకులకు నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.