రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రా మచ్చా సాంగ్ ప్రోమో విడుదల..

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రా మచ్చా సాంగ్ ప్రోమో విడుదల..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈరోజు ఈ చిత్రంలోని సెకెండ్ సింగిల్ రా మచ్చా పాట ప్రోమోని చిత్ర యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డీసెంట్ లుక్ లో కనిపించాడు.  45 సెకెన్ల ప్రోమోలో వివిధ రాష్ట్రాలకి చెందిన డ్యాన్స్ సంస్కృతులను చూపించారు.

ALSO READ | అఫీషియల్.. నివేదా థామస్ సూపర్ హిట్ ఫ్యామిలీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

దీంతో ఫుల్ సాంగ్ పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ పాటకి ప్రముఖ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా సింగర్ నకాష్ నజిజ్ పాడాడు. అయితే రా మచ్చా ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 30వ తారీఖున విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. 

ఆ మధ్య ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రా మచ్చా సాంగ్ గురించి తమన్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి రాయలసీమ చివరి వరకు అన్ని సంస్కృతులను పరిశిలించి దాదాపుగా 1000 మంది డ్యాన్సర్లతో పాటను చిత్రీకరించామని తెలిపాడు. అయితే తమన్ చెప్పిన విధంగానే ఈ ప్రోమోలో డ్యాన్సర్లతో స్టెప్పులు ఇరగదీశారు.