జనాలు లేకపోవటంతో గేమ్ ఛేంజర్ కి థియేటర్స్ తగ్గిస్తున్నారట..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన "గేమ్ ఛేంజర్" జనవరి 10న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయిన రోజే మిక్స్డ్ టాక్ రావటంతో కలెక్షన్లు సాధించలేకపోతోంది. కానీ రిలీజ్ కి ముందే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం, టికెట్ రేట్లు పెంచటం వంటివాటితో మొదటిరోజు రూ.186 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇందులో కూడా కలెక్షన్స్ యాడ్ చేసి ఫేక్ చేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

ఔట్ డేటెడ్ స్టోరీ, మేకింగ్ కన్వెన్సింగ్ గా లేకపోవడం వంటివాటితో గేమ్ ఛేంజర్ ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోతోంది. దీంతో పలు చోట్ల థియేటర్స్ లో జనాలు కరువయ్యారు. దీనికితోడు ఇంటర్ నెట్లో హెచ్డీ పైరసీ ప్రింట్ లీక్ అవ్వడం, లోకల్ ఛానెల్స్ లో ప్రసారం చెయ్యడంతో జనాలు థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ సినిమా చూడటం తగ్గిపోయింది. 

ALSO READ | RC 16: రామ్ చరణ్ RC 16 అప్డేట్.. జగ్గూభాయ్ మేకోవర్ వీడియో రిలీజ్

దీంతో థియేటర్ యజమానులు నష్ట పోతున్నారని భావించి గేమ్ ఛేంజర్ సినిమా ని నిలిపివేస్తూ అదే థియేటర్స్ లో వెంకటేష్ నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ని ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే ఉత్తరాంధ్రా, కృష్ణ జిల్లాల్లో పలు చోట్ల గేమ్ ఛేంజర్ సినిమాకి షోలు పూర్తిగా తగ్గించినట్లు సినీ వర్గాల సమాచారం.

అయితే గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత ఒకరే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా రూ.450 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాకి కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సీ లేకపోవడం బాధాకరమని చెప్పాలి.