Game Changer: రిలీజ్ కి ముందే పుష్ప 2 ఆ రికార్డుని బ్రేక్ చేసిన గేమ్ ఛేంజర్..

Game Changer: రిలీజ్ కి ముందే పుష్ప 2 ఆ రికార్డుని బ్రేక్ చేసిన గేమ్ ఛేంజర్..

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్, బ్రహ్మానందం, నవీన్ చంద్ర, సముధ్రఖని అంజలి, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. దీంతో గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. 

Also Read : బాలయ్య కూతురికి స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్

ఐతే ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే దాదాపుగా 180 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో టాలీవుడ్ లో 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్స్ లో గేమ్ ఛేంజర్ టాప్ లో నిలిచింది. అయితే ఇప్పటివరకూ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్(102 మిలియన్ వ్యూస్) టాప్ లో ఉంది. కానీ గేమ్ ఛేంజర్ అంతకుమించి అత్యధిక వ్యూస్ తో టాప్ లో నిలిచింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కలెక్షన్స్ విషయంలో కూడా గేమ్ ఛేంజర్ రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.