Game Changer: మొదలైన గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇప్పటికే అక్కడ ఒక షో టికెట్లు సేల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ నెల రోజుల ముందే ప్రమోషన్స్ లో వేగం పెంచారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియాలో గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా షురూ కాలేదు. ఓవర్సీస్ లో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ తో బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ మేరకు మేకర్స్ పోస్ట్ చేస్తూ.. "మెగా మాస్ మేనియాకు పట్టం కట్టాల్సిన సమయం ఇది! అత్యంత హైప్స్ తో ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ USA బుకింగ్‌లు డిసెంబర్ 14 నుండి ఓపెన్ అవ్వనున్నాయని" అని మేకర్స్ తెలిపారు. 

ఇప్పటికే యూకే లో అడ్వాన్స్ బుకింగ్స్ (డిసెంబర్ 9న) మొదలయ్యాయి. ఆ దేశంలో జనవరి 9నే ప్రీమియర్ షో పడనుంది. అక్కడి కేంబ్రిడ్జ్ లోని ప్రతిష్టాత్మక ది లైట్ సినిమాస్ చెయిన్లో షురూ అయింది. ఇప్పటికే యూకేలో ఒక షో టికెట్లు కూడా అమ్ముడైపోవడం విశేషం. మిగిలిన షోలకు కూడా చాలా వేగంగా బుకింగ్స్ జరుగుతున్నాయి. మెగా మాస్ మేనియా ఏం మాత్రం తగ్గేలా లేదు. 

ALSO READ | మోహన్ బాబు ఫ్యామిలీలో ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!

అంతేకాకుండా.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్ TX 75040 లొకేషన్లో సాయంత్రం 6:00 గంటలకి ప్రారంభం కానుంది. దీంతో ఓవర్సీస్ అభిమానులు ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఆమధ్య లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటున్న తొలి ఇండియన్ సినిమాగా గేమ్ ఛేంజర్ రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఇంతలా వేడి పుట్టిస్తున్న గేమ్ ఛేంజర్ మేనియా ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.