భారీ అంచనాల మధ్య రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ థియేటర్స్లో రిలీజైంది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా సుమారు 6600 స్క్రీన్స్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
దాదాపు రూ.500కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్కి ముందు ఎంత బిజినెస్ చేసింది? బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలంటే ఎంత కలెక్షన్స్ రాబట్టాలి? తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఎలా ఉంది? ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది? ట్రేడ్ వర్గాల అంచనాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలు చూద్దాం.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్:
ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం.. గేమ్ ఛేంజర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ) రూ.122 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఒక్క నైజాం ఏరియాలోనే సుమారు రూ.43 కోట్ల వరకు జరిగింది. ఓవర్సీస్ బిజినెస్ 25 కోట్లు చేసింది. దాంతో మొత్తం వరల్డ్ వైడ్‌గా గేమ్ ఛేంజర్ మూవీ రూ.220 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.222 కోట్లకు పైనే కలెక్షన్స్ రావాలని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 221+ కోట్ల షేర్ లేదా దాదాపు 425+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ హిట్‌గా నిలవాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మూవీగా గేమ్ ఛేంజర్ నిలిచింది. తెలుగు రాష్టాలు కాకుండా కర్ణాటకలో గేమ్ ఛేంజర్ దాదాపు రూ.14 కోట్లు, తమిళనాడులో రూ.15 కోట్లు మరియు కేరళలో రూ.2 కోట్ల బిజినెస్ చేసింది. హిందీలో ఈ సినిమా దాదాపు రూ.42 కోట్ల మేరకు బిజినెస్ జరిపిందని టాక్.
ఇకపోతే రామ్ చరణ్ కెరియర్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రం RRR. ఇది రూ.1230 కోట్లు వసూలు చేసింది. సోలో మూవీగా చెప్పుకోవాలంటే రంగస్థలం. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు వసూలు సాధించింది. ఇపుడు గేమ్ ఛేంజర్ ఎలా అవుతుందో చూడాలి.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
గేమ్ ఛేంజర్ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.110 కోట్ల నుంచి 120 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా. ఎందుకంటే ఈ మూవీకి ముందు క్రియేట్ అయిన బజ్ తో భారీగా టికెట్లు తెగాయి. ఓవర్‌సీస్‌తో కలిపి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే రూ.50కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కలుపుకొని రూ.120 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఈరోజు గడిస్తే పూర్తి టాక్ ఏంటనేది!