గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫాన్స్కి గుడ్ న్యూస్.. ఇకనుండి తెలుగులో

గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫాన్స్కి గుడ్ న్యూస్.. ఇకనుండి తెలుగులో

2011లో మొదలైన హాలీవుడ్(Hollywood) టెలివిజన్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్(Game of Thrones) కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. 8 సీజన్లుగా ఆడియన్స్ ను అలరిస్తున్న ఈ సిరీస్ కు ఇండియాలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇన్నాళ్లుగా ఇంగ్లీష్ భాషలోనే అవుతున్న ఈ సిరీస్ ఇకనుండి తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుందట.

కేవలం తెలుగులోనే కాదు లోకల్ భాషలంన్నింటిలో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా(Jio Cinema) ఓటీటీలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ని డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సిరీస్ ను మరోసారి తెలుగు చూసేందుకు రెడీ అవుతున్నారు ఆడియన్స్. అయితే.. జియో సినిమాస్ లో చాలా సినిమాలు ఫ్రీగానే స్ట్రీమింగ్ అవుతున్నా.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ డబ్బింగ్ వర్షన్ కు మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.