
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పూరిజగన్నాథ్ గారి స్ఫూర్తితో దర్శకుడు అవ్వాలని, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో కోర్సు చేశా.
చనిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్ ప్రవేశిస్తే అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది సినిమాటిక్‌గా చూపించాం. ఇందులో భాగంగా హీరో తొమ్మిది టాస్క్‌లు ఎదుర్కొవాల్సి వస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే టాస్క్ ఆసక్తికరం. రా అండ్ రస్టిక్‌గా చిత్రీకరించాం.
యూత్‌ను అట్రాక్ట్ చేస్తూనే, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. మధుబాల గారి పాత్ర చాలా కొత్తగా, ఐకానిక్‌గా ఉంటుంది. ఆదిత్యమీనన్ సైకాలజిస్ట్‌గా నటించారు. శుభలేఖ సుధాకర్ మరో కీలకపాత్ర పోషించారు. హీరోయిన్ నేహా సోలంకి పాత్ర చాలా మాసీగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్‌లో సర్‌ప్రైజెస్ ఉంటాయి. రియలిస్టిక్‌గా సాగే ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడొచ్చు’ అని చెప్పాడు.