ఆటలతోనే ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్

ఆటలతో ఆనందం, ఆహ్లాదంతోపాటు పర్సనాలిటీ కూడా డెవలప్​ అవుతుంది. ఆటలంటే ఫిజికల్​ ఎక్సర్​సైజ్​ మాత్రమే కాదు. మెంటల్​ స్ట్రెస్​ని గెలిచే వెపన్‌‌‌‌ కూడా. ప్రతి స్కూల్​లో కనీసం గంట సేపైనా పిల్లలను ఆటలు ఆడించాలి. ఇప్పటి స్కూల్స్​లో ప్లే గ్రౌండ్సే ఉండట్లేదు. దీంతో వాళ్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌కి అలవాటు పడుతున్నారు. ఇది ఒంటరితనానికి దారి తీస్తోంది. అదే నలుగురితో కలిసి ఆడితే సోషల్ స్కిల్స్ పెరుగుతాయి.

కార్పొరేట్ సంస్థల్లో పనిచేయడానికి టీం వర్క్ తప్పనిసరి. అలాంటి యూనిటీ ఆటలతోనే లభిస్తుంది. రెగ్యులర్‌‌‌‌గా గేమ్స్​ ఆడటం వల్ల బ్లడ్​ సర్క్యులేషన్​, డైజేషన్​ మెరుగుపడవుతాయి. పోటీ ప్రపంచంలో సక్సెస్​ కావాలంటే కాంపిటీటివ్‌‌‌‌ స్పిరిట్‌‌‌‌ ఉండాలి. అది ఆటల ద్వారానే సాధ్యమవుతుంది. ఓపిక, పట్టుదల, సెల్ఫ్​ కాన్ఫిడెన్స్​, పాజిటివ్ థింకింగ్​, ధైర్యం.. వీటన్నింటినీ ఆట పాటల్లో పాల్గొని సొంతం చేసుకోవచ్చు. ఇన్ని లాభాలు ఉన్న ఆఫ్​లైన్​ ఆటలను నేటి పిల్లలు ఆడుతున్నారా ఉంటే లేదనే చెప్పాలి.  వీటికి బదులుగా గంటల తరబడి ఆన్​లైన్​ గేమ్స్​ ఆడుతున్నారు. వాటిని విడిచిపెట్టలేకపోతున్నారు. క్షణం తీరిక దొరికినా చాలు మొబైల్​ చేతపట్టి రెండో వ్యక్తితో సంబంధం లేకుండా ఒక్కరే ఆడుకుంటున్నారు. ఇక, ఆడోళ్లైతే సీరియల్ బ్రేక్‌‌‌‌ టైమ్​లో సెల్​ఫోన్​లో ఆటల కోసం తొంగిచూస్తున్నారు. ఈ రోజుల్లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ ఒక వ్యసనంలా మారిందని వరల్డ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ ఒక రిపోర్టులో తేల్చి చెప్పింది. వివిధ కంపెనీలు ఆన్‌‌‌‌లైన్ గేమ్స్​ నుంచే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాయి.

2017 లెక్కల ప్రకారం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ ఇండస్ట్రీ టర్నోవర్​ 109 బిలియన్ డాలర్లు (రూపాయల్లో దాదాపు 7 లక్షల 56 వేల కోట్లు) అని లండన్​కి చెందిన వెంచర్‌‌‌‌ కేపిటల్‌‌‌‌ అనే సంస్థ తెలిపింది. ఆటలు మానసిక ప్రశాంతతను అందించాలి గానీ ప్రాణాలు తీయకూడదు. స్టూడెంట్స్​ స్టడీపై కాన్​సెన్​ట్రేషన్​ కోల్పోతున్నారనే సాకుతో సూళ్లలో, కాలేజీల్లో ఆటలను బ్యాన్​ చేయటం సరికాదు. ఆన్​లైన్​ గేమ్స్ మోజులో పడిపోయి పిల్లలు తమనితాము మరచిపోకూడదు.