గేమింగ్ కంపెనీల.. ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌

గేమింగ్ కంపెనీల.. ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌
  • గేమింగ్ కంపెనీల చూపు 
  • టోర్నమెంట్‌‌‌‌లు నిర్వహించాలని 
  • చూస్తున్న స్టార్టప్‌‌‌‌లు, పెద్ద కంపెనీలు
  • ఎంపీఎల్‌‌‌‌ కొత్త టెక్నాలజీతో వీలు
  • 2025 నాటికి  ఈ–స్పోర్ట్స్‌‌‌‌ వాల్యు రూ. 82 వేల కోట్లకు ..

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాబోయే కొన్నేళ్లలో దేశంలోని సినిమా ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీని మించి గేమింగ్ ఇండస్ట్రీ ఎదుగుతుందని  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ వేగంగా ఎదుగుతోంది.    పెద్ద పెద్ద కంపెనీలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు గేమింగ్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు చూస్తున్నాయి. తాజాగా ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ (ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్) సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ కూడా  కంపెనీలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే  యూరప్‌‌‌‌‌‌‌‌, యూఎస్, చైనా వంటి దేశాల్లో బాగా పాపులరయినా ఈ–స్టోర్ట్స్, ప్రస్తుతం ఇండియాలో  కూడా విస్తరిస్తోంది. ఈ–స్పోర్ట్స్ గేమ్స్‌‌‌‌లో  ఇతరులతో పోటీ పడడానికి వీలుంటుంది.  కంపెనీలు ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లను కూడా నిర్వహిస్తాయి.  లోకల్‌‌‌‌‌‌‌‌గా, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌గా ఉన్న ప్లేయర్లను రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకొని టోర్నమెంట్‌‌‌‌లు పెడతాయి. బయట స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అయ్యేటట్టే ప్రేక్షకులు ఈ వీడియో గేమ్‌‌‌‌‌‌‌‌ల కాంపిటేషన్‌‌‌‌‌‌‌‌ను కూడా ఫాలో అవ్వొచ్చు.  గెలిచిన వారికి ప్రైజ్‌‌‌‌‌‌‌‌ మనీ ఇస్తారు. సాధారణంగా బాగా  పాపులరయిన గేమ్స్‌‌‌‌‌‌‌‌పై కాంపిటేషన్‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తుంటారు. 

ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లోకి రావడానికి రెడీ
చాలా కంపెనీలు ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ వైపు కూడా చూస్తున్నాయని ఎనలిస్టులు అంటున్నారు. త్వరలో లాంచ్ చేయనున్న రేసింగ్ గేమ్‌‌‌‌‌‌‌‌లో ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌ను  కూడా అందుబాటులో ఉంచుతామని, దీంతో  ప్లేయర్లు ఇతర ప్లేయర్లతో పోటీ పడడానికి వీలుంటుందని చెన్నై గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్ దాస్‌‌‌‌‌‌‌‌  అన్నారు. అంతేకాకుండా టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లు నిర్వహించడానికి వీలుంటుందని చెప్పారు.   యూనికార్న్‌‌‌‌‌‌‌‌ స్టార్టప్ కంపెనీ మొబైల్ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (ఎంపీఎల్‌‌‌‌‌‌‌‌)  ఈ–స్పోర్ట్స్ కోసం  సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కిట్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌డీకే) ని అందుబాటులోకి తెచ్చింది. గేమ్‌‌‌‌‌‌‌‌ డెవలపర్ ఎవరైనా తమ గేమ్స్‌‌‌‌‌‌‌‌ను ఎంపీఎల్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌డీకేలో  అందుబాటులో ఉంచొచ్చు. ఇంకా ఈ –స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా నిర్వహించుకోవచ్చు. కరోనా సంక్షోభం తర్వాత  దేశంలోని గేమింగ్ డెవలపర్లు  ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లోని అవకాశాలను కూడా వెతకడం ప్రారంభిస్తున్నారు. చెన్నై  గేమ్స్‌‌‌‌‌‌‌‌  ఒక ఉదాహరణ మాత్రమేనని ఎనలిస్టులు అంటున్నారు.  మరో గేమింగ్ కంపెనీ నెక్స్‌‌‌‌‌‌‌‌వేవ్‌‌‌‌‌‌‌‌  మల్టీమీడియా కూడా ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో అవకాశాలు ఎక్కువని భావిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికేట్ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ 3 (డబ్ల్యూసీసీ3) ని  డెవలప్‌‌‌‌‌‌‌‌ ,పబ్లిష్ చేసింది.  ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌ కింద ఈ గేమ్‌‌‌‌‌‌‌‌లో చిన్న టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లను ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించామని నెక్స్ట్‌‌‌‌‌‌‌‌వేవ్‌‌‌‌‌‌‌‌ మల్టీమీడియా 
సీఈఓ రాజేంద్రన్ పీ.ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అన్నారు. ఆ తర్వాత రెడ్‌‌‌‌‌‌‌‌బుల్‌‌‌‌‌‌‌‌ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పెద్ద టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌ను కూడా నిర్వహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంపీఎల్‌‌‌‌‌‌‌‌ ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌డీకేను వాడుకోవాలని చూస్తున్నామని చెప్పారు. ప్రొడక్షన్, టెస్టింగ్ విషయంలో ఎంపీఎల్‌‌‌‌‌‌‌‌ ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌డీకే ప్రస్తుతం  చివరి దశలో ఉందని అన్నారు. మా గేమ్‌‌‌‌‌‌‌‌కు కొన్ని కస్టమైజ్డ్‌‌‌‌‌‌‌‌ ఈ–స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ టూల్స్ అవసరమవుతాయని, వీటిని ఎస్‌‌‌‌‌‌‌‌డీకే అందుబాటులో ఉంచుతోందని  చెప్పారు.  అంతేకాకుండా ఎంపీఎల్‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద కంపెనీలతో కలిసి పనిచేయడానికి వీలుంటుందని, తమ యూజర్ల బేస్‌‌‌‌‌‌‌‌ పెరగడానికి సాయపడుతుందని అభిప్రాయపడ్డారు. 

 

గేమింగ్ ఇండస్ట్రీ రెవెన్యూ పెరుగుతది..
ప్రస్తుతం ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ 1.5 బిలియన్ డాలర్ల (రూ. 11,250 కోట్ల)  రెవెన్యూని జనరేట్ చేస్తోందని బోస్టన్‌‌‌‌‌‌‌‌ కన్సల్టింగ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ (బీసీజీ) ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. ఈ రెవెన్యూ 2025 నాటికి మూడు రెట్లు పెరుగుతుందని అంచనావేసింది.  ఇండియన్ గేమింగ్ మార్కెట్‌‌‌‌లో 86 శాతం వాటా  మొబైల్ గేమ్‌‌‌‌లదే ఉందని  బీసీజీ పేర్కొంది. కాగా, ప్రస్తుతం దేశంలోని ఈ–స్పోర్ట్స్ సెగ్మెంట్‌‌‌‌లో పబ్జీ, గరెనా ఫ్రీ ఫైర్ వంటి విదేశీ గేమ్స్‌‌‌‌ ముందున్నాయి. ఎంపీఎల్ వంటి కంపెనీలు ఈ పరిస్థితులను మార్చాలని చూస్తున్నాయి. ఇండియన్ గేమ్స్‌‌‌‌ ఇంకా ఈ–స్పోర్ట్స్‌‌‌‌కు దూరంగానే ఉన్నాయి. కానీ, ఇండస్ట్రీ చాలా పెద్దదని, ఇక్కడ  లోకల్‌‌‌‌ ప్లేయర్లను రిక్రూట్ చేసుకొని రీజినల్‌‌‌‌ టోర్నమెంట్లను నిర్వహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. దేశంలో ఈ–స్పోర్ట్స్‌‌‌‌ మార్కెట్  ఆర్థిక సంవత్సరం 2024–25 నాటికి  రూ. 82 వేల కోట్లకు  చేరుకుంటుందని ఈవై ఇండియా అంచనావేసింది. ఈ ఇండస్ట్రీ పెద్ద మొత్తంలో ఎకానమీకి సాయపడుతుందని  తెలిపింది. బీసీజీ మాత్రం దేశంలో ఈ–స్పోర్ట్స్ సెగ్మెంట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌‌‌‌లోనే (100 మిలియన్ డాలర్ల వాల్యు) ఉందని, కానీ, వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది.

పబ్జీ మొబైల్ ఇండియా సిరీస్‌‌ 2020 టోర్నమెంట్‌‌లో  టీఎస్‌‌ఎం ఎంటిటీ టీమ్‌‌ ఫస్ట్‌‌ ప్లేస్ నిలిచింది. ఈ టీమ్‌‌ రూ. 20 లక్షల ప్రైజ్‌‌ మనీని గెలుచుకుంది. సెకెండ్ ప్లేస్‌‌లో ఫ్రానెటిక్‌‌ టీమ్‌‌ నిలిచింది. ఈ ఏడాది ఎడిషన్‌‌ ప్రస్తుతం జరుగుతోంది.  పబ్జీ మొబైల్ ఇండియా సిరీస్‌‌ 2019 టోర్నమెంట్‌‌లో టీమ్‌‌సోల్‌‌ ఫస్ట్​ఫేస్​లో నిలిచింది.   హైదరాబాద్‌‌లోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌‌లో ఈ టీమ్‌‌ గెలుపొందింది. మోర్టల్‌‌, వైపర్‌‌‌‌, రోనక్‌‌, ఒయాసిస్‌‌ తో కూడిన టీమ్‌‌సోల్ , రూ. 30 లక్షల ప్రైజ్‌‌ మనీని అందుకుంది.