నజారా టెక్​లో ఎస్​బీఐ ఎంఎఫ్.. ​ రూ. 410 కోట్ల పెట్టుబడి

నజారా టెక్​లో ఎస్​బీఐ ఎంఎఫ్.. ​ రూ. 410 కోట్ల పెట్టుబడి

ముంబై: ఎస్​బీఐ మ్యూచువల్​ ఫండ్​ తమ కంపెనీలో రూ. 410 కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించినట్లు నజారా టెక్నాలజీస్​ గురువారం  ప్రకటించింది. ప్రైవేట్​ ప్లేస్​మెంట్​ ప్రాతిపదికన ప్రిఫరెన్షియల్​ఎలాంట్​మెంట్​లో ఎస్​బీఐ భాగం పంచుకుంటుందని పేర్కొంది. రూ. 4 ఫేస్​ వాల్యూ ఉండే 57,42,296 షేర్లను ఒక్కో షేర్​కు రూ. 714 చొప్పున ఎస్​బీఐ మ్యూచువల్​ ఫండ్ ​ తీసుకుంటోందని వివరించింది. 

ఎస్​బీఐ మల్టీక్యాప్​ ఫండ్, ఎస్​బీఐ మ్యాగ్నమ్​ గ్లోబల్​ ఫండ్​, ఎస్​బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్​ ఫండ్ ​స్కీముల ద్వారా ఎస్​బీఐ ఎంఎఫ్​ ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు నజారా​ వెల్లడించింది. ఈ వారం మొదటిలో నితిన్​, నిఖిల్​కామత్​లు రూ. 100 కోట్లను నజారా టెక్నాలజీస్​లో పెట్టుబడిగా పెట్టిన విషయం తెలిసిందే. కంపెనీ గ్రోత్​ కోసం ఈ డబ్బు వెచ్చించనున్నట్లు నజారా టెక్​ సీఈఓ నితిష్​ మిట్టర్  ​సెయిన్​ చెప్పారు.