భిక్కనూరు, వెలుగు: ‘1994 నుంచి ఇప్పటి వరకు నేను సంపాదించిన ఆస్తులు జిల్లా ప్రజలకు పంచడానికి సిద్ధం.. నీవి, నీ తమ్ముడి ఆస్తులు పంచడానికి సిద్ధమా? ’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కాంగ్రెస్సీనియర్నేత షబ్బీర్అలీకి సవాల్‌విసిరారు. ప్రజల ఆశీర్వాదంతో కామారెడ్డి ఎమ్మెల్మేగా 5 సార్లు గెలిచానని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. మంగళవారం భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఆయన ప్రెస్‌మీట్ లో మాట్లాడారు. షబ్బీర్‌అలీ ఆరోపించినట్లు రామాయంపేట నుంచి కామారెడ్డి వరకు నా వెంచర్లు ఉన్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకపోతే షబ్బీర్‌అలీ పెద్దమల్లారెడ్డిలో ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటడా? అంటూ సవాల్‌విసిరారు.
ఇప్పటికీ నాకు హైదరాబాద్‌లో ఇల్లు లేదని గోవర్ధన్చెప్పారు. కామారెడ్డిలో 218 గజాల్లో ఇల్లు కట్టుకుంటే కబ్జా చేసి కట్టారని షబ్బీర్‌అలీ ఆరోపిస్తున్నారన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన నీకు , నీ తమ్ముడి కుటుంబానికి రూ.300 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని గోవర్ధన్ ప్రశ్నించారు. ఎంపీపీ గాల్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు కిష్టాగౌడ్, సిద్ధి రాములు, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.