ఎన్నికల ముందు అధికార పార్టీలో ఫ్లెక్సీల లొల్లి రోజు రోజుకు ముదురుతుంది. ఈరోజు(అక్టోబర్ 07) కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ టూర్ కు ముందు నేతల వర్గపోరు బయట పడ్డింది. కేటీఆర్ కు వెల్ కం చెబుతూ నగరంలో మున్సిపల్ చైర్ పర్సన్, జిల్లా అధ్యక్షుల ఫ్లెక్సీలు పెట్టారు. ఈ ఫ్లెక్సీల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫోటో పెట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వర్గీయులు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో మంత్రి కేటీఆర్ సభను నిర్వహించనున్నారు. 10 వేల మందితో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ కూడా నిర్వహించనున్నారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ టూర్ కు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక కేటీఆర్ బహిరంగ సభ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వివిధ పార్టీల నేతల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నారు.