ఊరూ వాడా గణపతి బొప్పా మోరియా నినాదాలు.. ప్రముఖ ఆలయాలు, మండపాలు కిటకిట

ఊరూ వాడా గణపతి బొప్పా మోరియా నినాదాలు.. ప్రముఖ ఆలయాలు, మండపాలు కిటకిట

దేశవ్యాప్తంగా గణేశ్​ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు, గణేశ్​ మండపాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్​ .. ఖైరతాబాద్​ వినాయకుడిని గవర్నర్​ దంపతులు దర్శించుకున్నారు. సికింద్రాబాద్​ గణపతి ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గువాహటి లతాషిల్​లోని గణేష్ మందిర్​లో శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని భక్తులు మట్టి దీపాలు వెలిగించారు

పుణెలోని ఓ కుటుంబం వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లింది. మరోవైపు దేశ, విదేశాల్లోని భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నాగ్​పూర్​లో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్లిన ఊరేగింపులో భక్తులు పాల్గొన్నారు. 

ALSO READ | ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం ( సెప్టెంబర్​ 7) ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో భక్తులు హారతి ఇచ్చారు.  ముంబైలో గిర్​గాంచ రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో భాగంగా పర్యావరణహిత వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఘట్కోపర్ పోలీస్ స్టేషనవ్​కి చెందిన పోలీసు అధికారులు శుక్రవారం వినాయకుడి విగ్రహాన్ని ముంబైలోని పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లారు.

 దిల్లీలో అమ్మకానికి ఉంచిన వినాయకుడి మట్టి విగ్రహానికి ఓ మహిళా కళాకారిణి శనివారం తుది మెరుగులు దిద్దారు. ముంబైలోని లాల్​బాగ్చా కా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ వద్ద వినాయకుడి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ ప్రసిద్ధ గణేష్ విగ్రహం 1934 నుంచి అక్కడ పూజలు పొందుతోంది.