గణపయ్యకు కరెన్సీ నోట్లతో అలంకరణ

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. నవరాత్రుల అంకె వచ్చే విధంగా 9,99,999 రూపాయలను ఇందుకు వినియోగించారు. 

కరెన్సీ నోట్ల మండపం భక్తులను విశేషంగా ఆకర్షించింది. సంఘం పక్షాన కరెన్సీ నోట్లను అలంకరించారు. రూ.10, 20, 50, 100, 200  నోట్లను ఇందుకు వినియోగించారు. మండపానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ, వినాయకుడి కిరీటం, గొడుగును కూడా కరెన్సీ తో డెకొరేట్  చేశారు.   -